రియల్టర్లు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించాలి

ABN , First Publish Date - 2021-12-23T23:02:09+05:30 IST

అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు.

రియల్టర్లు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించాలి

హైదరాబాద్: అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. తద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు సొంతింటి కలలు నిజమవుతాయని అన్నారు.కన్ఫిడరేషన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అధ్వర్యంలో గురువారం జరిగిన ‘ తెలంగాణ స్టేట్ కన్ క్లేవ్:2021’ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో గ్రీన్ హౌసింగ్ కాన్ సెప్ట్ ను పెద్దయెత్తున ప్రచారం చేయాలన్నారు. 


తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి అవకాశం వుంటుందన్నారు. విశాలమైన గాలి, వెలుతురు వుండే విధంగా ఇళ్ల నిర్మాణం చేయాలని గవర్నర్ సూచించారు. ఇళ్లలో నాణ్యత జీవనం, ఆరోగ్యకరమైన వాతావరణం వుండేలా చూడాలన్నారు. లాక్ డౌన్ల నేపధ్యంలో ఇళ్లలో తప్పని సరిగా ఒక రీడింగ్, పుస్తకాల కోసం గదిని నిర్మించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పురోగతిలో క్రెడాయ్ చేస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ కార్యదర్శి మురళీ క`ష్ణ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-23T23:02:09+05:30 IST