విద్యుత్ పొదుపు పై అవగాహన పెంచాలి: గవర్నర్

ABN , First Publish Date - 2021-12-20T00:50:31+05:30 IST

భవిష్యత్ అవసరాలకు విద్యుత్ కొరత రాకుండా ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు.

విద్యుత్ పొదుపు పై అవగాహన పెంచాలి: గవర్నర్

హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు విద్యుత్ కొరత రాకుండా ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన  తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అన్నది ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలన్నారు. విద్యుత్ ను వేస్ట్ చేయడం అంటే భవిష్యత్ లో విద్యుత్ కొరతకు కారణమవుతున్నట్టేనని అన్నారు. విద్యుత్ అవసరాలకు మించి వాడకుండా, పొదుపు చేయడం వల్ల దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారని అన్నారు. 


వచ్చే 25 ఏళ్లలో భారత్ ను ఎనర్జీ ఇండి పెండెంట్ కంట్రీగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్ పొదుపుపై అన్నిస్థాయిల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. మన ఇంటి నుంచే విద్యుత్ ఆదాను మొదలు పెట్టాలని సూచించారు. తద్వరా దేశవ్యాప్తంగా విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు. తద్వరా గ్లోబల్ వార్మింగ్, జాతీయ సంపదను తరిగిపోకుండా కాపాడ వచ్చన్నారు. విద్యుత్ ఆదా చేసేందుకు అన్నస్థాయిల్లో ఎల్ఈడీలను వాడడం మంచిందన్నారు. విద్యుత్ పొదుపులో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, టీఎస్ జెన్కో అండ్ ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T00:50:31+05:30 IST