దేశ ప్రగతిలో బ్యాంకర్ల సేవలు ప్రశంసనీయం:Governor

ABN , First Publish Date - 2022-05-28T01:51:23+05:30 IST

దేశ ప్రగతిలో బ్యాంకుల సేవలు ప్రశంసనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisy soundara rajan) అన్నారు.

దేశ ప్రగతిలో బ్యాంకర్ల సేవలు ప్రశంసనీయం:Governor

హైదరాబాద్: దేశ ప్రగతిలో బ్యాంకుల సేవలు ప్రశంసనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisy soundara rajan) అన్నారు. దేశ ఆర్ధిక ప్రగతికి బ్యాంకుల సిబ్బంది ఎంతో పాటుపడుతున్నారని చెప్పారు. కోవిడ్19 సమయంలోనూ ఆరోగ్యకరమైన ఆర్ధిక విధానాలకు, జాతి ప్రగతికి బ్యాంకుల సేవలు శ్లాఘనీయమన్నారు. శుక్రవారం ఆల్ ఇండియా యూకోబ్యాంక్(Uco bank) ఆఫీసర్స్ ఫెడరేషన్ 11వ త్రయనిల్ కాన్ఫరెన్స్ గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ సంకల్పమైన దేశం ఐదుట్రిలియన్ డాలర్స్ ఎకానమి సాధించడానికి బ్యాంకుల పాత్ర ఎంతో వుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. భారత దేశం గ్లోబల్ ఎకానమి మోడల్ గా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు.ఈ సందర్భంగా యూకోబ్యాంక్ సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ముఖ్యంగా ఓల్డేజ్ కేర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ప్లాస్టిక్ రహిత పర్యావరణం, విద్య వంటి అనేక రంగాల్లో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.  

Updated Date - 2022-05-28T01:51:23+05:30 IST