పండగల మాదిరిగా Yoga dayను నిర్వహించాలి:Governor

ABN , First Publish Date - 2022-05-27T23:27:44+05:30 IST

దేశంలో ఘనంగా నిర్వహించే దీపావళి, దసరా పాండగల మాదిరిగా ఇంటర్నేషనల్ యోగాడే(inter national yoga day)ను నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisy soundara rajan) పిలుపునిచ్చారు.

పండగల మాదిరిగా Yoga dayను నిర్వహించాలి:Governor

హైదరాబాద్: దేశంలో ఘనంగా నిర్వహించే దీపావళి, దసరా పాండగల మాదిరిగా ఇంటర్నేషనల్ యోగాడే(inter national yoga day)ను నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisy soundara rajan) పిలుపునిచ్చారు. గవర్నర్(governor) గానే కాకుండా ఒక డాక్టర్ గా చెబుతున్నా రోజూ యోగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇంటర్ నేషనల్ యోగాడే కౌంట్ డౌన్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరమే కాకుండా రాబోయే జనరేషన్ కూడా ఇంటర్ నేషనల్ యోగాడేను ఘనంగా నిర్వహించేలా చూడాలన్నారు. 


ప్రతి నిత్యం యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీఫిట్ నెస్ మాత్రమే కాదు, వివిధ రకాల వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చన్నారు. జూన్ 21ని ఇంటర్ నేషనల్ యోగాడేగా ప్రకటించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ థ్యాక్స్ చెప్పాలని అన్నారు. 167 దేశాలతో కూడిన యుఎన్ జనరల్ అసెంబ్లీలోకూడా యోగాకు మద్దతు తెలిపాయన్నారు. గత సంవత్సరం యోగాడేను 192 దేశాలు నిర్వహించాయన్నారు. రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. తద్వారా మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తడి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, పలువురు బీజేపి నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T23:27:44+05:30 IST