హైదరాబాద్: నిత్యం యంగ్‌గా ఉండాలంటే యోగా చేయాలని ప్రజలకు గవర్నర్ తమిళిసై(Tamilisai) సూచించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా మహోత్సవ్‌లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఫిట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుందని, హైపర్ టెన్షన్ వంటివి దూరం అవుతాయని తెలిపారు. జూన్ 21 న యోగాడేను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు యేడాది మొత్తం మీద ఎక్కువ పగలు ఉండే రోజు అని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 190 పైగా దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. యోగా మహోత్సవ్‌లో కేంద్ర మంత్రులు సర్వానంద్(Sarvanand), కిషన్‌రెడ్డి(Kishan reddy), ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh), దిల్‌రాజు(Dil raju), మంచు విష్ణు(Manchu Vishnu), సందీప్ కిషన్(Sandeep kishan) పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి