భారత్‌ ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా ఎదుగుతుంది- గవర్నర్‌

ABN , First Publish Date - 2020-08-13T23:27:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020’ భారత దేశాన్ని విద్యా రంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి తోడ్పడుతుందని గవర్నర్‌ తమిళిసైసౌందర రాజన్‌ అన్నారు.

భారత్‌ ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా ఎదుగుతుంది- గవర్నర్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020’ భారత దేశాన్ని విద్యా రంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి తోడ్పడుతుందని గవర్నర్‌ తమిళిసైసౌందర రాజన్‌ అన్నారు. మూడున్నర దశాడబ్ధాల తర్వాత వచ్చిన ఈ జాతీయ విద్యా విధానం భారత దేశ విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణల ద్వారా 21 శతాబ్ధాపు విద్యా విధానానికి శ్రీకారం చుడుతుందని అన్నారు. ‘ పర్‌ స్పెక్టివ్‌ ఆన్‌ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020- రోడ్‌ మ్యాప్‌ఫర్‌ తెలంగాణ’ అన్నఅంశంపై విద్యారంగ ప్రముఖులతో గురువారం గవర్నర్‌ వెబినార్‌ నిర్వహించారు. ఈసందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ యువతరం మెజార్టీగా ఉన్నభారత్‌ లాంటి దేశాల్లో నైపుణ్యాల శిక్షణ, గ్లోబల్‌ పోటీని తట్టుకునే విధంగా ఉద్యోగితా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలను, పరిశోధనలు ప్రోత్సహించే విధంగా ఈ విద్యా పాతసీని కస్తూరి రంగన్‌ నేతృత్వంలోని కమిటీ రూపొందించిందని తెలిపారు.


భారత్‌ను ఉన్నత విద్యాలో గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి , పూర్వ ప్రాధమిక విద్య నుంచి  పీహెచ్‌డి పరిశోధనల వరకు మొత్త విద్యా వ్యవస్ధను సంస్కరించి, సమూలంగా మార్చి 21వ శతాబ్దాపు అవసరాలకనుగుణంగా మార్చేదిశగా ఈ కొత్త విద్యా పాలసీ ఉందని గవర్నర్‌ వెల్లడించారు. గత నాలుగు దశాబ్ధాల్లో ప్రపంచం కనీ వినీఎరుగని విధంగా మారింది. అందుకు తగిన రీతిలో కృత్రిమమేధ, మెషిన్‌లెర్నింగ్‌, టెక్నాలజీ, కోడింగ్‌, డిజిటల్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే భారతీయ మూలాలను గౌరవించే విద్యా విధానానికి రూపకల్పన జరిగిందని గవర్నర్‌   చెప్పారు. ప్రాధమిక స్థాయిలో మాతృభాషలో బోదనలతోనే పిల్లల్లో గొప్ప మానసిక వికాసం సాధ్యమౌతుందని ఆమె అన్నారు. 

Updated Date - 2020-08-13T23:27:46+05:30 IST