అగ్రరాజ్యంలో కరోనా విలయం.. మహమ్మారి బారిన పడ్డ గవర్నర్!

ABN , First Publish Date - 2020-07-16T06:57:40+05:30 IST

కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. అమెరికాలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే..

అగ్రరాజ్యంలో కరోనా విలయం.. మహమ్మారి బారిన పడ్డ గవర్నర్!

వాషింగ్టన్: కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. అమెరికాలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. యూఎస్‌లోని ఓక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్టిట్ బుధవారం రోజు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. కుంటుంబానికి దూరంగా ఐసోలేషన్‌లో ఉంటూ పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. జూన్ 20న ఓక్లహోమాలోని టుల్సా నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం ఓక్లహోమాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కాగా.. ట్రంప్ పాల్గొన్న ఈ ఎన్నికల ర్యాలీలో ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టివ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ర్యాలీలో కెవిన్ స్టివ్ పాల్గొన్న కొద్ది రోజులకే ఆయన కరోనా బారినపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ర్యాలీలో పాల్గొనడం వల్లే ఆయనకు కరోనా సోకిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కెవిన్ స్టివ్ స్పందించి, ఖండించారు. కాగా.. అమెరికాలో కరోనా బారినపడిన మొదటి గవర్నర్ కెవిన్ స్టివ్. 


Updated Date - 2020-07-16T06:57:40+05:30 IST