విశాఖ ఏజెన్సీలో శిశు మరణాలపై గవర్నర్ ఆందోళ

ABN , First Publish Date - 2022-01-05T02:51:27+05:30 IST

విశాఖ ఏజెన్సీలో జరుగుతున్న శిశు మరణాలపై రాష్ట్ర

విశాఖ ఏజెన్సీలో శిశు మరణాలపై గవర్నర్ ఆందోళ

విశాఖ: విశాఖ ఏజెన్సీలో జరుగుతున్న శిశు మరణాలపై రాష్ట్ర గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆందోళన ఆందోళన వ్యక్తం చేశారు.  అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నివారణ చర్యల కోసం తక్షణ ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్ కులాలు, గిరిజన ప్రాంతాల పాలనాధికారులు  ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. 


గవర్నర్ ఆదేశాల మేరకు తాగునీటి పైపులు మార్చి, అత్యవసర వైద్య సేవల కోసం రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసవాలు, బాలింతలకు పాలిచ్చే తల్లులకు, గర్బిణీలకు, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 



జిల్లాలోని పాతరుడకోటలో గత 9 నెలల్లో 8 శిశు మరణాలు నమోదైనట్లు అధికారుల నివేదికలో తేలింది. ఈ  మరణాలు అన్నీ కూడా శిశువు పుట్టిన మూడు నెలల్లోనే జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. చాలా కాలం క్రితం వేసిన మంచి నీటి గొట్టాలు తుప్పు పట్టి త్రాగునీరు కలుషితమైందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. తల్లుల్లో క్యాల్షియం లోపమే శివు మరణాలకు కారణమని సమగ్ర విచారణలో తేలిందని  అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-05T02:51:27+05:30 IST