భగవాన్ బిర్సా ముండా సేవలను కొనియాడిన గవర్నర్

ABN , First Publish Date - 2021-11-15T23:21:49+05:30 IST

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా 146 వ జయంతిని రాజ్ భవన్ ఈరోజు ఘనంగా నిర్వహించారు.గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ భారత స్వతంత్ర సంగ్రామంలో భగవాన్ బిర్సా ముండా జరిపిన పోరును స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు

భగవాన్ బిర్సా ముండా సేవలను కొనియాడిన గవర్నర్

హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా 146 వ జయంతిని రాజ్ భవన్ ఈరోజు ఘనంగా నిర్వహించారు.గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ భారత స్వతంత్ర సంగ్రామంలో భగవాన్ బిర్సా ముండా జరిపిన పోరును స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. బిర్సా ముండా జయంతిని "జన జాతీయ గౌరవ దినోత్సవం" గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు.స్వాతంత్ర్య పోరులో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, త్యాగాలు చేసిన ఎందరో గిరిజన స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు. 


గిరిజన స్వాతంత్ర సమరయోధుల సేవలను భావితరాలకు తెలిసేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో మ్యూజియాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించడం శుభపరిణామం అని అన్నారు. గొప్ప చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన గిరిజనుల విశిష్ట సంస్కృతి సంప్రదాయాలను కళలను కాపాడాల్సిన ఆవశ్యకతను గవర్నర్ వివరించారు.సమగ్ర అభివృద్ధికి, వారి సాధికారతకు పని చేయడమే భగవాన్ బిర్సా ముండా కి మనం ఇచ్చే నిజమైన నివాళి అని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.రాజ్ భవన్ లోని   చారిత్రక దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి గవర్నర్ పుష్పాంజలి ఘటించారు.

Updated Date - 2021-11-15T23:21:49+05:30 IST