ధరలు నియంత్రించలేని ప్రభుత్వాలు గద్దెదిగాలి

ABN , First Publish Date - 2022-08-07T04:57:22+05:30 IST

ధరలు నియంత్రించలేని ప్రభుత్వాలు గద్దెదిగాలి

ధరలు నియంత్రించలేని ప్రభుత్వాలు గద్దెదిగాలి
పెరుగుతున్న ధరలను తగ్గించాలని ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌పార్టీ నాయకులు

మదనపల్లె రూరల్‌, ఆగస్టు 6: పెట్రో లు, డీజల్‌, గ్యాస్‌లతో పాటు నిత్యావ సర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెంటనే గద్దె దిగిపోవాలని రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా డిమాండ్‌ చేశాడు. దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసి స్తూ శనివారం  పట్టణంలోని బెంగళూరు బస్టాండులో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు గ్యాస్‌ రూ.470లు ఉంటే నేడు రూ.1130లకు పెరిగిందన్నారు. అదేవిధంగా పెట్రోలు, డీజల్‌ ధరలు లీటరుపై రూ.40ల నుంచి రూ.50ల వరకు పెరిగాయన్నారు. ఇక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా సామాన్య ప్రజానీకం కొనలేని స్థాయికి పెరిగిపోయాయ న్నారు. రాష్ట్రంలో సైతం పక్క రాష్ర్టాల కంటే పెట్రోలు, డీజల్‌ ధరలు ఎక్కువగా ఉన్నా ఇక్కడి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు షంషీర్‌, గిరీష్‌, నాగూర్‌వలీ, రెడ్డిసాహెబ్‌, ఇంతియాజ్‌, నజీర్‌, శంకర్‌నాయుడు, జయన్న, కిట్టన్న తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-07T04:57:22+05:30 IST