ఆదివాసుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-08-10T06:15:40+05:30 IST

: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు.

ఆదివాసుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలు
సూర్యాపేటలో నినాదాలు చేస్తున్న సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా నాయకులు

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జిల్లాకేంద్రంలోని విక్రమ్‌భవన్‌ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆదివాసులకు పట్టాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత  పోడుభూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నార న్నారు. ఆదివాసులను స్వేచ్ఛగా అడవుల్లో నివసించే వీలులేకుండా ప్రభుత్వాలు నియంత పాలన సాగిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రకళ, కొత్తపల్లి రేణుక, ఎర్ర అఖిల్‌, పుల్లూరి సింహాద్రి, జీవన్‌, జయమ్మ, శైలజ, అంజలి, మధు తదితరులు పాల్గొన్నారు. 

మఠంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి నూతన చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మాలోతునాగునాయక్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని దొనబండతండా, భీల్యానా యక్‌తండా, మఠంపల్లి మండలకేంద్రాల్లో ప్రపంచ అదివాసి, గిరిజన దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. గిరిజనుల బాష, సాం స్కృతి సంప్రదాయ ఆచార్య వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి గతంలో ఆగస్టు 9వ తేదీనే గిరిజన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలునా యక్‌, బాలాజీనాయక్‌, బాబునాయక్‌, రంగానాయక్‌, రమేష్‌నాయక్‌, బీటెక్‌సైదానాయక్‌ లాలియానాయక్‌, చింగ్లానాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:15:40+05:30 IST