విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-06-30T05:07:50+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగా న్ని నిర్వీర్యం చేస్తున్నాయని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు వెంకటేశ్‌, రవికుమార్‌ ఆరోపించారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
రూరల్‌ తహసీల్దార్‌ పాండుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

- టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన

మహబూబ్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 29 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగా న్ని నిర్వీర్యం చేస్తున్నాయని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు వెంకటేశ్‌, రవికుమార్‌ ఆరోపించారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు మేరకు బుధవారం సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వారు నిరసన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధా నం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకరయ్య, రాంబాబు, మండల నాయకులు రాము పాల్గొన్నారు.

విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి 

మూసాపేట : తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని మండల స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నాయకులు డిమాండ్‌ చేశారు. టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త క్యాంపెయిన్‌లో భాగంగా బుధవా రం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేట్టారు. పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ వరప్రసాద్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌, మండల కమిటీ అధ్యక్షుడు శివరాజు, నాగార్జున్‌, నర్సప్ప, రాకేష్‌ ఉన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

మిడ్జిల్‌ : టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయ, విద్యారంగ  సమస్యల పరిష్కారానికి తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ మండల అధ్యక్షులు ఆర్‌. నర్సిములు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య కోరారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మయ్య, మల్లయ్య, రవికుమార్‌, జానకమ్మ, ప్రభావతి, రాజ్యలక్ష్మి, వసుంధర ఉన్నారు.

Updated Date - 2022-06-30T05:07:50+05:30 IST