ప్రజా వ్యతిరేక విదానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ ఆరోపించారు.

ప్రజా వ్యతిరేక విదానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌

- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌

కళ్యాణ్‌నగర్‌, మే 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ ఆరోపించారు. శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలోని శ్రామిక్‌ భవన్‌లో సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగానే రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వ స్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అసంఘటితరంగ కార్మికరంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెరగడం లేదన్నారు. జీవో కాలపరిమితి ముగిసి ఎనిమిది సంవత్సరాలు అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను సవరించకుండా కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తోందన్నారు. అధి కారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లలో దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టిందని, దీంతో చాలా మంది కార్మికులు వీధినపడ్డారని ఆయన అన్నారు. ఈనెల 30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని పట్టణా లు, మండల కేంద్రాల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరవెల్లి ముత్యంరావు, మెండె శ్రీనివాస్‌, రామాచారి, నర్స య్య, నాగమణి, వనజారాణి, కృష్ణకుమారి, లక్ష్మారెడ్డి, ఉల్లి మొగిలి, గణేష్‌, భూమ య్య, వెంకటస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST