ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి వీడాలి

ABN , First Publish Date - 2022-07-04T05:05:11+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరిని వీడి, ప్రజా సంక్షేమం కోసం పాటు పాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ తెలిపారు.

ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి వీడాలి
మహాసభలో మాట్లాడుతున్న జాఫర్‌

యాడికి, జూలై 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరిని వీడి, ప్రజా సంక్షేమం కోసం పాటు పాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని చందన గ్రామంలో సీపీఐ మహాసభ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. మహాసభలో జాఫర్‌ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వ్యవసాయ సాగు చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిం చిందని, అలాంటి ఏ ప్రభుత్వం మనుగడలో ఉండదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, చేతివృత్తుల సంఘం జిల్లా కార్యదర్శి లింగమయ్య, నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, సహాయ కార్యదర్శి వెంకటరాముడుయాదవ్‌, మండల ప్రధాన కార్యదర్శి వీబీ వెంకటేష్‌, నాయకులు శ్రీరాములు, నబీరసూల్‌, సూరన్న పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T05:05:11+05:30 IST