న్యాయవ్యవస్థపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి: సీజేఐ

ABN , First Publish Date - 2021-12-27T02:35:54+05:30 IST

న్యాయవ్యవస్థపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని సీజేఐ ఎన్వీరమణ విమర్శించారు. బెజవాడలో కోర్టు నిర్మాణం పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని

న్యాయవ్యవస్థపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి: సీజేఐ

అమరావతి: న్యాయవ్యవస్థపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని సీజేఐ ఎన్వీరమణ విమర్శించారు. బెజవాడలో కోర్టు నిర్మాణం పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వాలు మారినా బిల్డింగ్ నిర్మాణం పూర్తికాలేదన్నారు. త్వరలో తానే వచ్చి కోర్టు బిల్డింగ్‌ ప్రారంభిస్తానని ఆశిస్తున్నానని తెలిపారు. న్యాయవ్యవస్థను మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్దాయికి శిక్షపడాలనే ఆలోచించేలా పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉందని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని ఎన్వీ రమణ ఆకాంక్షించారు.


‘‘ప్రజలకు కోర్టులపై నమ్మకం ఉన్నందునే 4 కోట్ల కేసులు ఉన్నాయి. జడ్జీలకు జరుగుతున్న అవమానాలపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. డబ్బు లేక న్యాయం పొందలేని పరిస్థితి రాకూడదు. పేదలకు ఉచిత న్యాయం అందేలా లాయర్లు చూడాలి. కోర్టుల్లో సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరినా స్పందన లేదు. కింది కోర్టుల్లో తీర్పుల కాపీలను మాతృభాషలో ఇవ్వాలి’’ ఎన్వీ రమణ చెప్పారు.

Updated Date - 2021-12-27T02:35:54+05:30 IST