ప్రజలకు మెరుగైన వైద్యం ప్రభుత్వాల బాధ్యత

ABN , First Publish Date - 2021-06-24T05:44:14+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాద్యత ప్రభుత్వాలపైన ఉన్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రజలకు మెరుగైన వైద్యం ప్రభుత్వాల బాధ్యత
భోజనం ప్యాకెట్లు అందజేస్తున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

- ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ నర్సిరెడ్డి 

నల్లగొండ రూరల్‌, జూన్‌ 23 : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాద్యత ప్రభుత్వాలపైన ఉన్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎం  ఆధ్వర్యంలో నాణ్యమైన ఆహారం అందిస్తూ, ఐసోలేషన్‌ కేంద్రం ద్వారా వైద్యం అందించడం అభినందనీయమని అన్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ప్రతి పౌరుడికీ వైద్యం, వసతి, ఆహారం కనీస సౌకర్యాలు కల్పించాలని ఉన్నప్పటికీ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అన్నారు. అనవసరమైన దుబారా ఖర్చులు మానుకో వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్‌ ఎత్తివేశారని, అయినప్పటికీ కరోనా ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూనే తమ తమ పనులు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున,  జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌హాషం,  పుచ్చకాయల నర్సిరెడ్డి,  పాలడుగు ప్రభావతి,  దండెంపల్లి సత్తయ్య, భూతం అరుణకుమారి, కొండా వెంకన్న, మధుసుధన్‌రెడ్డి, రవీందర్‌, రేణుక పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-24T05:44:14+05:30 IST