ఉక్రెయిన్ అంశం.. ప్రభుత్వానికి అందరి మద్దతు: జై శంకర్

ABN , First Publish Date - 2022-03-03T23:46:52+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిని వివరించేందుకు గురువారం నిర్వహించిన పార్లమెంటరీ సలహా సంఘం సమావేశం ఫలప్రదంగా సాగిందని కేంద్రం ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ అధ్యక్షతన, 21 మంది సభ్యులతో ఈ సమావేశం జరిగింది.

ఉక్రెయిన్ అంశం.. ప్రభుత్వానికి అందరి మద్దతు: జై శంకర్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిని వివరించేందుకు గురువారం నిర్వహించిన పార్లమెంటరీ సలహా సంఘం సమావేశం ఫలప్రదంగా సాగిందని కేంద్రం ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ అధ్యక్షతన, 21 మంది సభ్యులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, విదేశాంగ శాఖ సెక్రటరీ హర్ష వర్ధన్ సింఘ్లాతోపాటు పార్లమెంట్ ఎంపీలు హాజరయ్యారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విఫలమవడంపై, ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకపోవడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. వాస్తవ పరిస్థితిని వివరించేందుకు ప్రభుత్వం ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. 


ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకురావడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ మీటింగ్‌లో అన్నిపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయని, తగిన సూచనలు కూడా చేశాయని కేంద్రం ప్రకటించింది. ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించామని, ప్రభుత్వానికి అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారని జై శంకర్ ట్వి్ట్టర్‌లో పేర్కొన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. ప్రభుత్వంతో చర్చలు బాగా జరిగాయని, దేశం విషయంలో అన్ని పార్టీలు ఒకేతాటిపై ఉంటాయని, ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. సమావేశంలో చర్చించిన విషయాల గురించి వెల్లడించలేనన్నారు.

Updated Date - 2022-03-03T23:46:52+05:30 IST