రైతు ఇంటికే ఎరువులు

ABN , First Publish Date - 2020-10-01T08:20:33+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటికే నేరుగా ఎరువులు అందజేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. బుధవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీ్‌సలో జగన్‌ సమక్షంలో రైతులకు ఎరువుల హోమ్‌ డెలివ రీ ప్రక్రియను కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు...

రైతు ఇంటికే ఎరువులు

  • హోమ్‌ డెలివరీ విధానానికి శ్రీకారం
  • సీఎం జగన్‌ సమక్షంలో కేంద్ర మంత్రి ప్రారంభం

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటికే నేరుగా ఎరువులు అందజేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. బుధవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీ్‌సలో జగన్‌ సమక్షంలో రైతులకు ఎరువుల హోమ్‌ డెలివ రీ ప్రక్రియను కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కొవి డ్‌-19 నేపథ్యంలో వేలిముద్రతో పనిలేకుండా ఓటీపీ ద్వారా రైతులు ఎరువులు పొందవచ్చు. సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 10,641 రైతుభరోసా కేంద్రాలున్నాయని, రైతులు తమకు కావాల్సిన ఎరువుల వివరాలను కియో్‌స్కల్లో నమో దు చేసుకుంటే 48గంటల్లో ఇంటికి పంపుతామని చెప్పారు.  ఆర్బీకేల వద్ద ప్రత్యేక ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌(నంబర్‌ 155251)తో రైతులు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని, ఆర్బీకేలు డిజిటల్‌ పేమెంట్లు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీకేల ద్వారా 15రకాల పంటలకు 6.9లక్షల టన్నుల విఽత్తనాలను 13.64లక్షల రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.  


ప్రత్యక్ష నగదు బదిలీ సక్సెస్‌: కేంద్ర మంత్రి 
దేశంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ప్రత్యక్ష నగదు బది లీ విధానం సమర్థంగా పని చేస్తోందని  కేంద్ర మంత్రి సదానందగౌడ చెప్పారు. డీబీటీ అమలులో పారదర్శక కారణంగా ఎరువుల శాఖ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఎరువులను హోండెలివరీ చేసేందుకు ఏపీ తీసుకున్న చొరవను అభినందించారు. కేంద్ర సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవి యా మాట్లాడుతూ ఏపీ అమలు చేసిన ఈ విధానాన్ని  న మూనాగా తీసుకుని ఇతర రాష్ట్రాలు అమలు చేయవచ్చని సూచించారు. ఓటీపీ ద్వారా ఎరువులు పొందడమే కాకుండా,  7738299899 నంబరుకు మెసేజ్‌ పంపడం ద్వారా రైతు ఏ రిటైల్‌ అవుట్‌లెట్‌లోనైనా ఎరువుల లభ్యత సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు. 

Updated Date - 2020-10-01T08:20:33+05:30 IST