పేదలకు ప్రభుత్వం అండ : మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-01-21T05:04:28+05:30 IST

పేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ సహాయం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

పేదలకు ప్రభుత్వం అండ : మంత్రి హరీశ్‌రావు
ప్రవీణ్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/నారాయణఖేడ్‌/పటాన్‌చెరు, జనవరి 20 : పేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ సహాయం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లికి చెంందిన ప్రవీణ్‌కు రూ.45 వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేశారు. ఇందులో మంత్రి హరీశ్‌రావు వీరాభిమాని సిందే చంద్రం తదితరులు పాల్గొన్నారు. అలాగే నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఖేడ్‌ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. పెద్దశంకరంపేటకు చెందిన రాములు, సిద్ధంగిర్గకు చెందిన రాజుకు రూ.లక్ష చొప్పున, ఖానాపూర్‌ నాగప్పకు రూ.1.34 లక్షలు, కడ్పల్‌కు రాములుకు రూ.48 వేలు, కృష్ణవేణికి రూ.44 వేలు, వీరోజిపల్లికి చెందిన పెంటయ్యకు రూ.23 వేలు మంజూరయ్యాయి. అలాగే వీరోజిపల్లికి చెందిన తెరాస క్రియాశీల కార్యకర్త కుమ్మరి బాలరాజు ప్రమాదంలో మృతిచెందడంతో బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును మృతుడి భార్య అంబమ్మకు అందజేశారు. ప్రజారోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్కరూ రుణపడి ఉన్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్‌చెరు క్యాంపు కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, నాయకులు దశరథరెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, అఫ్జల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:04:28+05:30 IST