చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2022-08-08T06:22:08+05:30 IST

చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనంది స్తోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. ఆదివారం జడ్పీ సమా వేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ప్రతిజ్ఞ నిర్వహించారు.

చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ 

 చేనేత రంగంలో మన్నిక గల ఉత్పత్తుల తయారీ : కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 7: చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనంది స్తోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. ఆదివారం జడ్పీ సమా వేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేనేత వస్ర్తాల ఉత్పత్తులకు సహాకారం అందిస్తుందని, కార్మికులకు పింఛన్‌, బీమా సౌక ర్యం వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. జిల్లాలో చేనేత సంఘాల ఏర్పా టు, వస్ర్తాల తయారికి ప్రభుత్వం ప్రోత్సాహాం అందిస్తుందని వివరించారు. చేనే త కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సా ధించాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ స్వదేశ్‌ మూమెంట్‌ సమ యంలో చేనేత మూమెంట్‌ రావడం జరిగిందని, దేశ వ్యాప్తంగా ఆగస్టు 7న ప్రతీ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. చేనే త రంగలలో మన్నిక గల ఉత్పత్తులు ఉన్నాయని, పోచంపల్లి, గద్వాల్‌, నారాయ ణ్‌పేట్‌ వస్ర్తాలు పేరుగాంచాయని తెలిపారు. 2014 నుంచి సిరిసిల్ల, గద్వాల్‌లలో  సొసైటీలను ఏర్పాటు చేసి నేతన్నలకు ప్రభుత్వం సహకారం అందించిందని తెలిపారు. సాంకేతికక నైపుణ్యంతో ధీర్ఘకాలికంగా వస్ర్తాలు వినియో గంలోకి వస్తున్నాయని తెలిపారు. జిల్లాలో పత్తి సాగు ఎక్కువ ఉన్నందున చేనేత వస్ర్తా ల తయారుకు సంఘాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పరిశ్రమల శాఖ నుం చి చేనేత కార్మికులకు సహాకారం అందించవచ్చని అన్నారు. భవిష్యత్తులో విద్యా ర్థులు చేనేత అంశాలపై విస్త్రృతంగా వినియోగంలోకి తీసుకురావాలని సూచిం చారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, డీఆర్డీవో కిషన్‌, నెహ్రూ యువకేంద్రం కో ఆర్డినేటర్‌ సుశీల్‌, సెక్టోరల్‌ అధికారి ఉదయశ్రీ, ఆత్మ చైర్మన్‌ జిట్టా రమేష్‌, ఆయా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:22:08+05:30 IST