ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-06T04:09:53+05:30 IST

పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్క రించాలని, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి గోవర్దన్‌, సన్ని గౌడ్‌లు డిమాండ్‌ చేశారు. మంగళవారం డీఈవో కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని, ఎంఈవో పోస్టులను భర్తీ చేయ డం విస్మరించిందన్నారు.

ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌,  జూలై  5:  పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్క రించాలని, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి గోవర్దన్‌, సన్ని గౌడ్‌లు డిమాండ్‌ చేశారు. మంగళవారం డీఈవో కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని, ఎంఈవో పోస్టులను భర్తీ చేయ డం విస్మరించిందన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని, మన ఊరు, మన బడిలో అన్ని పాఠశాలలను చేర్చి అభి వృద్ధికి పాటుపడా లన్నారు. జీవో నం. 42ను అమలు చేస్తూ పాఠశాలల అధిక ఫీజుల దోపిడి అరికట్టాలన్నారు. డీఎఫ్‌ఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మనోహర్‌, అజయ్‌, కిరణ్‌, కిషోర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-06T04:09:53+05:30 IST