కోదాడ, జనవరి 23: సంక్షోభంలో ఉన్న రవాణా రంగానికి ప్రభుత్వం చేయూత ఇచ్చి ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా లారీ యాజమానుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పైడిమర్రి వెంకటనారాయణ అన్నారు. కోదాడలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన లారీ యజమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని, జీఎస్టీ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలు పైబడిన వాహనాలను నడపొద్దని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కనగాల నాగేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్, విలాసకవి రామరాజు, గుండపనేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.