కేసీఆర్ ఇలాకలో అధికారుల మందు పార్టీపై ప్రభుత్వం సీరియస్

ABN , First Publish Date - 2021-06-12T22:13:01+05:30 IST

కేసీఆర్ ఇలాకలో అధికారుల మందు పార్టీపై ప్రభుత్వం సీరియస్

కేసీఆర్ ఇలాకలో అధికారుల మందు పార్టీపై ప్రభుత్వం సీరియస్

సిద్దిపేట: పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మందు పార్టీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం సంచలనం సృష్టించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలకు దిగడంతో అధికారుల్లో వణుకుపుడుతోంది. త్వరలోనే కేసీఆర్ కొండపాక మండలంలో పర్యటించడం, ఇక్కడే ప్రభుత్వ అధికారులు పనులు మానేసి మందు విలాసాల్లో మునిగితేలడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది.  


కాగా సీఎం కేసీఆర్ ఇలాక కొండపాకలోని ఓ మామిడితోటలో అధికారులు మందు పార్టీని నిర్వహించారు. కొవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తూ అధికారులు మందు పార్టీలో ఊగిపోయారు. కొండపాక మండల అధికారులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం గమనార్హం. జిల్లా ఎంపీవోలకు ఆహ్వానం అందగా.. డీఆర్‌డీ, ఓపీడీ, ఇన్‌ఛార్ట్ డీపీవో భోజనం చేసి వెళ్లినట్లు సమాచారం. పార్టీకి కొండపాక మండల పంచాయతీ కార్యదర్శులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 22 మండలాలకు చెందిన పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుకున్న ఏబీఎన్ ప్రతినిధులు... మందు పార్టీ నిర్వహిస్తున్న మామిడితోటకు వెళ్లారు. దీన్ని గమనించిన ఉద్యోగులు పరారయ్యారు.

Updated Date - 2021-06-12T22:13:01+05:30 IST