Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ దేవాదాయశాఖాధికారుల తీరుపై ప్రభుత్వం సీరియస్‌

అమరావతి: విశాఖ దేవాదాయశాఖాధికారుల తీరుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఆఫీస్‌లోనే అధికారులు గొడవలపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విచారణాధికారిగా రాజమండ్రి ఆర్జేసీ సురేష్‌బాబు నియమించారు. జిల్లా దేవదాయ శాఖ పరువు గంగలో కలిసిపోయింది. గురువారం ఉదయం డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఉండగా, అసిస్టెంట్ కమిషనర్ శాంతి చాంబర్‌లోకి ప్రవేశించి, చేతితో తెచ్చిన ఇసుకను ఆయన ముఖంపై విసిరి దుర్భాషలు ఆడడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ తెలపగా, తనను ఆయన మానసికంగా వేధిస్తున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆరోపించారు.


మరోవైపు విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నివేదిక కోరారు. దేవాదాయశాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పనితీరుపై మహిళా కమిషన్ ఆరా తీసింది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ తనపై దుష్ప్రచారం చేయడంతో అతనిపై ఇసుక కొట్టానని శాంతి ఆరోపిస్తున్న నేపథ్యంలో సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను మహిళా కమిషన్ ఆదేశించింది.

Advertisement
Advertisement