ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-25T05:55:53+05:30 IST

మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథాకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రభుత్వం నుంచి 25 శాతం రాయితీపై వచ్చిన ట్రాక్టర్‌ను శ్రీ చాముండేశ్వరీ మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సభ్యులకు అందజేశారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రాయితీపై వచ్చిన ట్రాక్టర్‌ను అందజే స్తున్న ప్రభుత్వ విప్‌



దోమకొండ, జనవరి 24: మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథాకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రభుత్వం నుంచి 25 శాతం రాయితీపై వచ్చిన ట్రాక్టర్‌ను శ్రీ చాముండేశ్వరీ మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల సమాఖ్య ఆధ్వర్యంలో స్త్రీనిధి రుణం నుంచి రూ.12 లక్షలు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం గ్రాంట్‌ రూ.4 లక్షలు మొత్తం రూ.16 లక్షలతో ట్రాక్టర్‌, ట్రాలీ, రోటవేటర్‌, కల్టీవేటర్‌, కేజ్‌వీల్‌, పంట నూర్పిడి యంత్రాలను సమాఖ్య రైతులకు అందుబాటులోకి  తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం దోమకొండ: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ రైతుబంధు క్యాలెండర్‌లను ఆవిష్కరించారు.మండలంలోని అంబార్‌పేట గ్రామ సర్పంచ్‌ సలీం అనారోగ్యంతో బాధపడుతుండడంతో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరామర్శించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌,  ఏఎంసీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, వైస్‌ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, విండో చైర్మన్‌ నాగరాజ్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నర్సారెడ్డి, పిరంగి రాజేశ్వర్‌, షమ్మీ,సర్పంచ్‌ అంజలి, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, మురళీకృష్ణ, రవి కుమార్‌, వకుళ, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏవో పవన్‌ కుమాన్‌, ఏపీఎం రాజు, సీసీలు రాజేశం, శ్రీనివాస్‌, రమేష్‌, దేవలక్ష్మీ, సునీత, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:55:53+05:30 IST