ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-21T06:40:45+05:30 IST

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో అమరవరం గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్‌నగర్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

 హుజూర్‌నగర్‌ , జనవరి 20: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో అమరవరం గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ సుజాతఅంజిరెడ్డి, లింగారెడ్డి, మట్టారెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం  ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఐదో వార్డుకు చెందిన కాకి శ్రీకాంత్‌ను, ఆరో వార్డులో ఇటీవల మృతిచెందిన లక్కా లక్ష్మి కుటుంబాన్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో అమర్‌నాథ్‌రెడ్డి, గెల్లిరవి, జక్కుల నాగేశ్వరరావు, వీరయ్య, రాంగోపి, రాంబాబు, దళపతి, సంపత్‌వర్మ, మంగమ్మ, వీరారెడ్డి పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అండగా ఉంటా 

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.  పట్టణంలోని టీఆర్‌ఎస్‌ నాయకుడు జక్కుల శ్రీకాంత్‌ నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్యకర్తల ఆగడాలను అడ్డుకుంటామని అన్నారు.  కాంగ్రెస్‌ కార్యకర్తల బెది రింపులకు టీఆర్‌ఎస్‌  కార్యకర్తలు భయపడొద్దన్నారు. సమావేశంలో గెల్లి రవి, జక్కుల శంభయ్య, తండు  సాయిరాం,  హరికృష్ణ, నవీన్‌రెడ్డి, పిల్లి శ్రీను, సైదులు, రవి, అంజి, సతీష్‌, నాగరాజు, రామారావు, శేఖర్‌, గౌతమ్‌, సలీమ్‌, కార్తీక్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు. 

గిరిజన ఉపాధ్యాయం సంఘం డైరీ ఆవిష్కరణ

పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం డైరీని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆవి ష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి, కొండానాయక్‌, జగ్గూనాయక్‌, మణిరామ్‌, సుమిత్ర, వెంకట్రామ్‌, బాబూనాయక్‌, శంకర్‌నాయక్‌, వెంకన్న, మంజునాథ్‌ పాల్గొన్నారు.

జాన్‌పహాడ్‌ ఉర్సుకు ఆహ్వానం

పాలకవీడు: ఈ నెల 27, 28, 29తేదీల్లో నిర్వహించే జాన్‌పహాడ్‌ ఉర్సులో పాల్గొనాలని ఎమ్మెల్యే సైదిరెడ్డిని దర్గా ప్రతినిధులు  ఆహ్వా నించారు. హుజూర్‌నగర్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం కలిసి అహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బానోతు విజయ, వెంకట్‌, టక్కు శ్రీను తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-21T06:40:45+05:30 IST