ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-14T07:16:03+05:30 IST

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట 45వ వార్డు కౌన్సిలర్‌ గండూరి పావని కృపాకర్‌ అన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
పెన్‌పహాడ్‌ మండలం అనంతారంలో రంజాన్‌ తోఫా అందజేస్తున్న ప్రజా ప్రతినిధులు

సూర్యాపేటటౌన్‌/పెన్‌పహాడ్‌/ హుజూర్‌నగర్‌/ హుజూర్‌నగర్‌ రూరల్‌/ మఠంపల్లి/ మేళ్లచెర్వు, మే 13: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట 45వ వార్డు కౌన్సిలర్‌ గండూరి పావని కృపాకర్‌ అన్నారు. రంజాన్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌లో గురువారం రంజాన్‌ తోఫా అందజేశారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ పండుగనికార్యక్రమంలో కుక్కడపు బిక్షం, ఇస్మాయిల్‌, కందాల వెంకన్న, షావోద్దీన్‌ పాల్గొన్నారు. 47, 37వ వార్డుల కౌన్సిలర్లు కు మ్మరికుంట్ల దేవికవేణుగోపాల్‌, బైరు శైలేందర్‌గౌడ్‌ ముస్లింలకు రంజాన్‌ తోఫా అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రావుల రాంబాబు, చెరుకు రవి, గునగంటి సైదులు, రెడ్డిపల్లి శివ, సైఫ్‌ పాల్గొన్నారు. పెన్‌పహాడ్‌ మండలం అనంతారం గ్రామంలో మసీదుల అభివృద్ధికి జడ్పీటీసీ మామిడి అనిత రూ. 7వేలు, సర్పంచ్‌ బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి రూ.7 వేలు, ఎంపీటీసీ మామిడి రేవతి రూ. 2వేల ను ముస్లిం పెద్దలకు అందజేశారు. అనంతరం రంజాన్‌ తోఫాలు పంపిణీ చేశారు. హుజూర్‌నగర్‌ మండలంలోని లక్కవరం, వేపలసింగారం గ్రామాల్లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను ఎంపీపీ గూడెపు శ్రీను, జడ్‌పీటీసీ కొప్పుల సైదిరెడ్డి  పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అన్నెం శిరీషకొండారెడ్డి, సౌజన్యనరేష్‌, కాశమ్మ, పిన్నపురెడ్డి వీరభద్రారెడ్డి, కొండారెడ్డి, వీరారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. జిల్లా రగ్బీ ఛైర్మన్‌ గెల్లి రవి, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సుప్రజ, సూర్యనారాయణ, రాజశేఖర్‌, వెంకటేశ్వర్లు, ఉన్నారు. మఠంపల్లి మండలంలో 53మందికి మంజూరైన కల్యాణలక్ష్మీ చెక్కులను ఎంపీపీ ముడావత్‌ పార్వతికొండానాయక్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు అందజేశారు. మేళ్లచెరువు మండలంలోని రేవురూలో కల్యాణలక్ష్మీ చెక్కులను తహసీల్దార్‌ దామోదార్‌ పంపిణీ చేశారు. 

Updated Date - 2021-05-14T07:16:03+05:30 IST