అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-05-22T06:35:09+05:30 IST

మండలంలోని కొత్తూరు ముత్యాలమ్మపాలెం పంచాయతీలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా యండపల్లి పాలెంకాలనీ, దొర లకాలనీలలో ఇంటింటికీ వెళ్లి పథకాలు అందుతున్నదీ లేని తెలుసుకున్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి ముత్యాలనాయుడు


  ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో  డిప్యూటీ సీఎం ‘బూడి‘

దేవరాపల్లి, మే 21 : మండలంలోని కొత్తూరు ముత్యాలమ్మపాలెం పంచాయతీలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా యండపల్లి పాలెంకాలనీ, దొర లకాలనీలలో ఇంటింటికీ వెళ్లి పథకాలు అందుతున్నదీ లేని తెలుసుకున్నారు. ఇల్లు కావాలని దరఖాస్తు చేస్తే ఇవ్వ డం లేదని ఓ వ్యక్తి చెప్పగా వీఆర్‌వో అలక్ష్యం ఉందని తెలుసుకుని ఆయ నను హెచ్చరించారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని తహ సీల్దార్‌ జె.రమేష్‌బాబు ఇతర అధి కారులను ఆదేశించారు. జడ్పీటీసీ కర్రిసత్యం, చోడవరం సీఐ ఇలియాస్‌ మహమ్మద్‌, ఎస్‌ఐ సింహాచలం, నాయకులు బూరే బాబూరావు, సుబ్బలక్ష్మి, సర్పంచ్‌ రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ బుల్లి లక్ష్మి, గంగాభవానీ, సీడీపీవో ఉమాదేవీ, వైద్యాధికారి లలిత, ఏఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే ధర్మశ్రీ వద్ద పప్పు చీటీ బాధితుల మొర 

బుచ్చెయ్యపేట : పప్పుచీటీ కట్టి లక్షలాది రూపాయలు మోసపో యామని, తమకు డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వద్ద బాధిత మహిళలు మొరపెట్టుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే   గంటికొర్లాంలో పర్యటిం చారు. తొలుత ఎమ్మెల్యేకు తమగోడు చెప్పుకునేందుకు వారు ప్రయ త్నించారు. అయితే వైసీపీకి చెందిన స్థానిక నాయకులు కొందరు ‘మాకు చెప్పి పప్పుచీటీ కట్టారా.. ఇప్పుడు మాకు ఫిర్యాదు చేయడానికి’ అని ఎమ్మెల్యేను కలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి మహిళలతో వాగ్వా దానికి దిగారు. ఇది గుర్తించిన ఎమ్మెల్యే బాధితులతో మాట్లాడారు. అనంతరం గంటికొర్లాంకు మంజూరైన గ్రామ సచివాలయాన్ని కోమళ్లపూడికి మార్చడంపై యువకులు ప్రశ్నించారు. ఆ తరువాత గ్రామంలో సమస్యలను పలువురు వివరించారు. జడ్పీటీసీ దొండా రాం బాబు, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు కె.అచ్చెంనాయుడు, పీఆర్‌ డీఈఈ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:35:09+05:30 IST