పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-06-25T05:37:59+05:30 IST

పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు

పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు
మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

- ‘తితలీ’ పెంపు పరిహారం పంపిణీలో మంత్రి ధర్మాన

పలాస/రూరల్‌: పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం బొడ్డపాడు గ్రామంలో పెంచిన తితలీ తుఫాన్‌ పంట నష్టపరిహారం పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తితలీ తుఫాన్‌ పరిహారం కోసం ఇంకా ఆరువేల మంది రైతులు ఎదురు చూస్తున్నారని, వారి సమస్య కూ డా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరి ష్కరిస్తామన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రికి రెండు కళ్లలాంటివని కొనియాడారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కూడా ప్రసంగించారు. అనంతరం తితలీ పరిహారం చెక్కును కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అందించారు. మత్స్య, పశుసం వర్థక శాఖమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించి పతాకాలు ఆవిష్కరించారు. కాగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీల నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గానికి చెందిన వ్యాపారులు, సర్పంచ్‌లు, అధికారుల నుంచి  వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-06-25T05:37:59+05:30 IST