పేదలకు వరంగా ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

పేదలకు వరంగా ప్రభుత్వ పథకాలు

పేదలకు వరంగా ప్రభుత్వ పథకాలు
షాద్‌నగర్‌ రూరల్‌: కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే

  • ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌


షాద్‌నగర్‌ రూరల్‌, జూలై 1: సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు పేదలకు వరంగా మారాయని  ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిషత్‌ మీటింగ్‌హాల్‌లో శుక్రవారం 24మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వరి, ఎంపీపీ ఖాజాఇద్రిస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, ఎంపీడీవో వినయ్‌కుమార్‌, నాయకులు లక్ష్మణ్‌నాయక్‌, యుగేందర్‌ యాదగిరి యాదవ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని విఠ్యాలకు చెందిన రైతు కోస్గి చెన్నయ్య మృతిచెందగా బాధిత కుటుంబానికి మంజూరైన రూ.5లక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో  రాజేశ్వరి, ఎంపీపీ ఖాజాఇద్రిస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, ఎంపీడీవో వినయ్‌కుమార్‌, కౌన్సిలర్లు యుగేందర్‌, చింటూ, వెంకట్‌రాంరెడ్డి, లక్ష్మణ్‌ నాయక్‌, చంద్రశేఖర్‌, యాదగిరి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాట్కోట్రస్టు సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే 

నందిగామ: విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న న్యాట్కోట్రస్టు సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. మండలంలోని రంగాపూర్‌ న్యాట్కో పాఠశాలలో న్యాట్కోట్రస్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ విద్యార్థులకు శుక్రవారం సాముహిక అక్షరాభ్యాసం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నందిగామ, కొత్తూర్‌ మండలాల్లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి న్యాట్కో ట్రస్టు సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, ఎంపీపీ ప్రియాంక, మంజుల, మంజులారెడ్డి, పద్మారెడ్డి, రమేష్‌, రాజునాయక్‌, నాగమణి, జ్యోతి, రాంబాబు, సత్యనారాయణ, సాంబశివరావు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఉచిత వైద్యసేవలు అభినందనీయం 

షాద్‌నగర్‌ అర్బన్‌: స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ షాద్‌నగర్‌శాఖ, షాద్‌నగర్‌ పట్టణంలోని మూడు లయన్స్‌ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బుగ్డారెడ్డి గార్డెన్‌లో శుక్రవారం ఉచిత మెగా వైద్యశిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు.  ఈ శిబిరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులను లయన్స్‌క్లబ్‌ సభ్యులు సన్మానించారు. వివిధ విభాగాలకు చెందిన 50మంది వైద్యుల బృందం వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, జడ్పీటీసీ సభ్యుడు పి.వెంకట్‌రాంరెడ్డి, ఐఎంఏ నాయకులు డాక్టర్లు రమేష్‌ బండారి, నాగవర్ధన్‌రెడ్డి, కెఎల్‌ కుమార్‌, విజయ్‌కుమార్‌, నాగిరెడ్డి, చందులాల్‌రాథోడ్‌, టీవి శ్రీనివాస్‌, దిలీ్‌పచంద్ర, ప్రశాంత్‌, రామకృష్ణ, శారద, శ్రీనివాస్‌, ప్రేమ్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST