విద్యుత్‌ చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం : టీడీపీ

ABN , First Publish Date - 2021-10-20T04:59:44+05:30 IST

వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను, పన్నులను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు.

విద్యుత్‌ చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం : టీడీపీ
పెరిగిన విద్యుత్‌ చార్జీలపై ప్రజలకు వివరిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా

రాయచోటిటౌన్‌, అక్టోబరు19: వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను, పన్నులను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు.  మంగళవారం మండల పరిధిలోని అబ్బవరం, గొర్లముదివేడు, ఏపిలవంకపల్లె తదితర గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వంలో అవినీతి, దుబారా ఖర్చు తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించడంతో పాటు ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ప్రజా దోపిడీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యావసర ధరలు పెరిగి బతుకే భారంగా మారిన పరిస్థితుల్లో విద్యుత్‌ చార్జీల భారం కూడా ప్రజలపై పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. 

Updated Date - 2021-10-20T04:59:44+05:30 IST