చేనేత రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-08T06:14:31+05:30 IST

చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నేత కార్మికులకు ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు

చేనేత రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం
పూలమాలలు వేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి 

- ఘనంగా  జాతీయ చేనేత దినోత్సవం

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 7: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నేత కార్మికులకు ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌  జయంతి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జాతీయ చేనేత దిత్సోవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చేనేత విగ్రహానికి  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, చేనేత మరియు జౌళిశాఖ ఏడీ సాగర్‌, ప్రజాప్రతి నిధులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. నేతన్నను గౌరవించడం కోసం 2015 నుంచి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి మాట్లాడుత దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి పొందుతన్న రంగం చేనేత దాని అనుబంధ రంగాలే అని తెలి పారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, చేనేత జౌళి శాఖ ఏడీ సాగర్‌,  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌  ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, పాలిస్టర్‌ ఉత్పత్తి దారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు మండల సత్యం, వస్త్ర పరిశ్రమ, అనుబంధ సంఘాల నాయకులు, చేనేత, జౌళిశాఖ, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 కార్మికులకు న్యాయం చేయండి

ప్రమాదవశాత్తు మరణించిన వారికి నేతన్న బీమా పథకం కాకుండా బతికుండగా నేత కార్మికులకు న్యాయం చేయాలని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జాతీయ చేనత దినోత్సవం వేడుకలలో భాగంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణం సంజీవయ్య విగ్రహాం నుంచి నేతన్న విగ్రహాం వరకు పొన్నం ప్రభాకర్‌, నాయకులు పాదయాత్ర నిర్వహించారు. నేతన్న విగ్రహాంకు పొన్నం ప్రభాకర్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షు డు నాగల సత్యనారాయణ పూలమాలలు వేశారు.  కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, వెంగళ అశోక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకు నూరి బాలరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత నాయ కులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

పద్మశాలి సంఘం జిల్లా, పట్టణ సంఘాల సం యుక్త ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం  నిర్వ హించారు. స్థానిక కొత్తబస్టాండ్‌ సమీపంలోని నేతన్న విగ్రహంకు పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షుడు లగిశెట్టి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, నాయ కులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌, బాలయ్య మాట్లాడారు. పద్మశా లీలు ఐక్యంగా ఉండాలని అన్నారు. ఈ నెల 12న రాఖీ పౌర్ణమి రోజున సాయంత్రం నిర్వహించనున్న శ్రీ శివభక్త మార్కండేయ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా, పట్టణ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో...

బీఎస్పీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం  నిర్వహించారు. నేతన్న విగ్రహానికి నాయకులు పూల మాలలు వేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్‌ చార్జి కుంట శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు చాకలి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చందూనాయక్‌, ప్రధాన కార్యదర్శి స్వామీగౌడ్‌, నియోజకవర్గం ఇన్‌చార్జి లింగంపల్లి మధూకర్‌, ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు,  వేములవాడ ఇన్‌చార్జి బొడ్డు మహేందర్‌, పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ భాను, జిల్లా మాజీ అధ్యక్షుడు దొబ్బల నరేష్‌, రాష్ట్ర నాయకులు అంకని భాను, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:14:31+05:30 IST