Abn logo
Jun 23 2021 @ 03:55AM

వివరాలు కోరం.. ఫిర్యాదులపైనే చర్యలు

 ఈ-కామర్స్‌ ఫ్లాష్‌ సేల్స్‌పై ప్రభుత్వం


న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ కంపెనీల మోసపూరిత విక్రయాల నియంత్రణకు ఫ్లాష్‌ సేల్స్‌ వివరాలు వెల్లడించమని కోరడం జరగదని, వినియోగదారుల ఫిర్యాదులపైన మాత్రం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కస్టమర్లకు అధిక ప్రయోజనం చేకూర్చే డిస్కౌంట్‌ సేల్స్‌ కొనసాగుతాయని, మోసపూరిత ఫ్లాష్‌ సేల్స్‌ను మాత్రమే అరికట్టడం జరుగుతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


ఈ-కామర్స్‌కు సంబంఽధించి సోమవారం విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై కంపెనీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటోంది. ఆన్‌లైన్‌ కామర్స్‌ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్‌ సెల్లింగ్‌, మోసపూరిత ఫ్లాష్‌ సేల్స్‌పై నిషేధం విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కస్టమర్ల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈ-కామర్స్‌ సైట్లు చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ గ్రీవియెన్స్‌ ఆఫీసర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలన్నది మరో నిబంధన. అంతేకాదు, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐ టీ) వద్ద ఈ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది.