ఆసీస్‌ ట్రావెల్‌ బ్యాన్‌తో టీమిండియాకు కష్టమే!

ABN , First Publish Date - 2020-03-30T09:58:18+05:30 IST

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరు నెలల పాటు తమ దేశ సరిహద్దులను మూసే యాలని నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఆ దేశంలో

ఆసీస్‌ ట్రావెల్‌ బ్యాన్‌తో టీమిండియాకు కష్టమే!

న్యూఢిల్లీ: కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరు నెలల పాటు తమ దేశ సరిహద్దులను మూసే యాలని నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఆ దేశంలో జరిగే క్రికెట్‌ సిరీ్‌సల పరిస్థితిపై అయోమయం నెలకొంది. ఎందుకంటే.. ఆరు నెలల ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా ఏ జట్టు కూడా ఆసీ్‌సలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఇది ముఖ్యంగా టీమిండియాపై ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివర్లో కోహ్లీసేన ఆసీ్‌సలో పర్యటించాలి. అక్టోబరులో టీ20 ముక్కోణపు సిరీ్‌సతో ఆరంభమయ్యే ఈ టూర్‌ జనవరిలో టెస్టు సిరీ్‌సతో ముగుస్తుంది. ఈ మధ్యలో టీ20 ప్రపంచకప్‌ కూడా అక్కడే జరగనుంది. ఆసీ్‌సలో ప్రస్తుతం 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 16 మంది మృతి చెందారు. అందుకే తమ సరిహద్దులను మూసేసి ఇతర దేశస్థులను అడ్డుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది. ‘ఇప్పుడే ఈ విషయంపై స్పందించడం తొందరపాటే అవుతుంది. ఈ తీవ్రత తగ్గిపోతే ఆరు నెలల నిషేధం త్వరగానే ఎత్తివేసే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అంతకాలం బ్యాన్‌ కొనసాగితే ఆ తర్వాత టీ20 ముక్కోణపు ట్రోఫీ ప్రయాణ ఏర్పాట్లు మాకు సవాల్‌గా నిలుస్తాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. 

Updated Date - 2020-03-30T09:58:18+05:30 IST