నర్సుల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-04-17T05:26:08+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న నర్సుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, సీనియర్‌ నర్సులకు ప్రమోషన్లు, ఇన్సెంటివ్‌లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నర్సుల సమస్యలు పరిష్కరించండి
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావుకు వినతిపత్రం ఇస్తున్న నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

నర్సుల సమస్యలు పరిష్కరించండి 

గవర్నమెంట్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ 

విజయవాడ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న నర్సుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, సీనియర్‌ నర్సులకు ప్రమోషన్లు, ఇన్సెంటివ్‌లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆ సంఘ సర్వసభ్య సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరుతూ గవర్నమెంట్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు డి.మంజులదేవి, జనరల్‌ సెక్రటరీ శివకుమారి, కోశాధికారి శాంతమ్మ తదితర ప్రతినిధులు ఆస్కారరావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

Updated Date - 2021-04-17T05:26:08+05:30 IST