విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-19T06:39:20+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సాధన కోసం యూ ఎస్‌పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నల్లగొండ టౌన్‌, మే 18: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సాధన కోసం యూ ఎస్‌పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడు, ఎనిమిదేళ్లుగా పదోన్నతులు కల్పించకుండా విద్యార్థులకు సబ్జెక్టు టీచర్‌ లేకుండా, మండల విద్యాధికారులు లేకుండా విద్యా వ్యవస్థ కొనసాగుతోందన్నారు. విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభం, పరిష్కారానికి మార్గం సుగమమైందంటూ మార్చిలో బదిలీలు, పదోన్నతులు చేపడతామని సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో వెంటనే బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ ప్రకటించాలని కోరారు. మన ఊరు మనబస్తీ- మనబడి కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలని అందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలన్నారు. ప్రతినెలా మొ దటి తేదీన వేతనాలు విడుదల చేయాలని, సప్లమెంటరీ బిల్లుల జాప్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు ఎడ్ల సైదులు, పి. వెంకులు, రామకృష్ణ, రత్తయ్య, ఖుర్షిద్‌మియా, షాహీన్‌తయ్యబ్‌, పెరుమాళ్ల వెంకటేశం, నంద్యాల రాజశేఖర్‌, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎం. రాజశేఖర్‌రెడ్డి, జి. నాగమణి, బక్క శ్రీనివాసచారి, సరళ, నర్ర శేఖర్‌ రెడ్డి, మురళయ్య, అరుణ, విజయలక్ష్మీ, రమాదేవి, నర్సింహ, రాజు, వెంకన్న, నాగిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T06:39:20+05:30 IST