రూ. 10 కోట్లు రంగుపాలు

ABN , First Publish Date - 2020-06-29T11:40:20+05:30 IST

ప్రభుత్వ సొమ్ములు వృథా అయ్యాయి. జిల్లాలో పంచాయతీ, సచివాలయ కార్యాలయాలకు రంగుల ఆర్భాటంతో హడావుడి చేసిన

రూ. 10 కోట్లు రంగుపాలు

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి):  ప్రభుత్వ సొమ్ములు వృథా అయ్యాయి. జిల్లాలో పంచాయతీ, సచివాలయ కార్యాలయాలకు రంగుల ఆర్భాటంతో హడావుడి చేసిన ప్రభుత్వానికి న్యాయ స్థానంలో చుక్కెదురైంది. దాంతో మళ్లీ రంగులు మారుస్తున్నారు. పంచా యతీలకు అప్పు చేసి రంగులు వేస్తున్నారని గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఎన్నికలొస్తే మళ్లీ రంగులను మార్చాల్సి ఉంటుందని తేట తెల్లం చేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది.జిల్లాలో పంచాయతీ, సచివాలయ కార్యాలయాలకు రం గులు మార్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రంగులను వేస్తూ అధికారులు హడావుడి చేశారు. పంచాయతీల్లో నిధులు అందుబాటులో లేకపోవడంతో అప్పులు చేసి మరీ రంగులు వేశారు.


జిల్లాలో ఉన్న 909 పంచాయతీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలను తలపించేలా రంగులతో మెరిశాయి. అందుకోసం కోట్ల రూపాయలు వెచ్చించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ భవనాలకు వైసీపీ రంగులతోనే ముస్తాబు చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఫొటోలతో సచివాలయాలపై బోర్డులు పెట్టారు. ఇప్పుడవన్నీ తొలగించే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ భవ నాలపై రంగులను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాల్సి వచ్చింది. తాజాగా వైసీపీ రంగులను తొలగిస్తూ కొత్త రంగులను వేస్తున్నారు.ఈ మేరరకు మళ్లీ అదనపు నిధులు వెచ్చిస్తున్నారు.జిల్లాలో రంగులు మార్చేందుకు దాదాపు రూ. 10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-06-29T11:40:20+05:30 IST