యువత ఉపాధికి ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2021-10-23T07:21:23+05:30 IST

యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి తెలిపారు. ఆలేరు మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మోతీరాం తండాలో శుక్రవారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.

యువత ఉపాధికి ప్రభుత్వం చర్యలు
మోతీరాంతండాలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి

తుర్కపల్లి, అక్టోబరు 22: యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి  తెలిపారు. ఆలేరు మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మోతీరాం తండాలో శుక్రవారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పశు గణాభి వృద్ధి పథకం కింద 50శాతం సబ్సిడీతో బ్యాంక్‌ లింకేజీ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు ఇస్తుందన్నారు. నాటు కోళ్ల ఫాం, గొర్రెలు మేకల పెంపకం వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడా నికి యువత ముందుకు రావాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఆఽధ్వర్యంలో  రైతులకు గడ్డి విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తుందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో వర్మీ కంపోస్ట్‌ షెడ్డులు ఏర్పాటు చేసుకొని సేంద్రీయ ఎరువులు తయారు చేసి విక్రయించి ఉపాధి పొందవచ్చన్నారు. దీనికి అవసరమైన రుణ సదుపాయంతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. గత యాసంగిలో కొన్న ధాన్యం నిల్వలు గోదాముల్లో ఉన్నాయని ఈ ధాన్యం నిల్వల్లో 75శాతం నిల్వలను బయటకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. రుస్తాపురం గ్రామంలోని రాయిన్‌ చెరువు నిండి అలుగు నీటిలో రోడ్డు మునిగిందని. పొలాలకు వెళ్లాలంటే  ప్రతీ రోజు ఈ నీటి నుంచే వెళ్లాల్సివస్తోందని సర్పంచ్‌ ఆధ్వర్యంలో పలువురు రైతులు సునీత దృష్టికి తీసుకువచ్చారు.ఈ ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. అదే విధంగా పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని, మరో ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ కార్య క్ర మంలో జిల్లా పశువైద్యాధికారి కృష్ణ, ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, ఎంపీపీ భూక్యా సుశీలరవీందర్‌నాయక్‌, సర్పంచ్‌ భానోతు బిచ్చునాయక్‌, మండల రైతు బంధు అధ్యక్షుడు కె.నర్సింహులు, వైస్‌ ఎంపీపీ ఎం.శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు, సింగిరెడ్డి నర్సింహారెడ్డి, గూదె బాల నర్సింహ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, పాల సంఘం చైర్మన్‌ తార్‌చంద్‌, సర్పంచ్‌ కల్లూరి ప్రభాకర్‌రెడ్డి, సుంకరి శెట్టయ్య, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు పిన్న పురెడ్డి నరేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 





Updated Date - 2021-10-23T07:21:23+05:30 IST