వ్యవసాయ చట్టాలను సవరించనున్న కేంద్రం!

ABN , First Publish Date - 2020-12-05T20:44:06+05:30 IST

రైతు ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యవసాయ చట్టాలను సవరించాలని

వ్యవసాయ చట్టాలను సవరించనున్న కేంద్రం!

న్యూఢిల్లీ : రైతు ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యవసాయ చట్టాలను సవరించాలని ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో పాటు కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించే అవకాశాలపై కేంద్రం దిగొచ్చే అవకాశముందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై న్యాయ శాఖతో కూడా వ్యవసాయ శాఖ చర్చలు జరిపినట్లు సమాచారం. ఐదో విడత చర్చలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులు షా, రాజ్‌నాథ్, తోమర్, పీయూశ్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే కేంద్ర వ్యవసాయ చట్టాలను సవరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-05T20:44:06+05:30 IST