ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

ABN , First Publish Date - 2022-08-17T06:28:02+05:30 IST

తెలంగాణలో ప్రభుత్వ భూములు అన్నాక్రాంతం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

-పేదలకు అందని విద్య, వైద్యం

- ధరణి పోర్టల్‌లో అనేక ఇబ్బందులు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

చిగురుమామిడి,అగస్టు 16: తెలంగాణలో ప్రభుత్వ భూములు అన్నాక్రాంతం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో 18వ సీపీఐ మండల  మహాసభ అందె చిన్న స్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశనికి ముందు పార్టీ జెండాను అవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వైద్యం పేదలకు అందడం లేదన్నారు. ధరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని గద్దె దించేవరకు కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేయాలన్నారు. దేశంలో సామాన్య ప్రజలకు ఎలాంటి రుణమాఫీ చేయకుండా కార్పొరేట్‌  సంస్థలకు 12 కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. మతోన్మాద శక్తులను దేశంలో లేకుండా చేయాలన్నారు. అర్హులకే దళితబంధు వర్తించేలా ఉద్యమాలు చేయాలన్నారు.రానున్న రోజుల్లో వరదకాలువ పనులపై ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, మండల కార్యదర్శి నాగెళ్లి లక్ష్మరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు అందె స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి కోహెడ సృజన్‌కుమార్‌, మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు గూడెం లక్ష్మి, రాకం అంజవ్వ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T06:28:02+05:30 IST