జిల్లాలో 71 క్లస్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2020-05-23T09:56:09+05:30 IST

జగిత్యాల జి ల్లాలో 71 క్లస్టర్లు ఉన్నాయని, ప్రతి క్లస్టర్‌కు ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్‌ రవి అన్నారు.

జిల్లాలో 71 క్లస్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి

వానా కాలం పంటలపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌


జగిత్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జి ల్లాలో 71 క్లస్టర్లు ఉన్నాయని, ప్రతి క్లస్టర్‌కు ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్‌ రవి అన్నారు. శుక్రవారం వానాకాలంలో వేయాల్సిన పంటలపై కలెక్టర్‌ రవి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరం లే కపోయినా 20 గుంటలైనా చూడాలని, గ్రామ పరిధిలో లేకుంటే దూరంగా ఉన్నా చూడాలన్నారు. ప్రభుత్వ భూమి లేనియెడల నిరుపయోగంగా ఉ న్న భవనాలను గుర్తించాలని, అవి లేని చోట దా తలు ముందుకు వస్తే వారి పేరు మీదనే భవనా లు నిర్మిస్తామన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎక రా ల్లో పంటలు సాగు చేస్తున్నారని, ఇంతకుముం దు ఏఏ రకమైన పంటలు వేశారో వివరాలను గ్రామాలవారీగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో సూర్య విత్తనాలపై తనిఖీలు చేయాలని, డీలర్‌ షాపుల్లో తనిఖీలు చేసి స్టాక్‌ను పరిశీలించాలని, తప్పులు ఉంటే కేసులు పెట్టాలని అన్నారు.


జిల్లా లో వరి సాగు ఎంత చేస్తున్నారో అంతే చేయాల ని, ఫైన్‌ వెరైటీ రకాలు పెట్టే విధంగా రైతులను చైతన్యపరుచాలన్నారు. గతంలో 21 శాతం ఫైన్‌ వెరైటీ వేశారని, వారి వివరాలు సేకరించాలని అ న్నారు. ప్రతి మండలానికో యాక్షన్‌ ప్లాన్‌ తయా రు చేసుకుని, వానా కాలంలో మొక్కజొన్న ఎందు కు వేయకూడదో, దాని వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలని అన్నారు. కంది, పత్తి పంట లు వేసుకునే విధంగా రైతులను చైతన్యపరుచాల ని అన్నారు. జిల్లాలో 13 మండలాల్లో పామాయిల్‌ పంటకు అనుకూలంగా భూములున్నాయని, వారి ని అక్కడ పామాయిల్‌ సాగు చేసే విధంగా అవ గాహన కల్పించాలన్నారు.


జిల్లాలో వలస కూలీలు దాదాపు 5136 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని, వారంతా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారని అన్నారు. వారి కదలికల పై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే ఐసోలేషన్‌కు తరలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం, డీఆర్‌వో అరుణశ్రీ, ఆర్డీవో నరేందర్‌, జిల్లా వ్యవసాయాధికారి సురేష్‌ కుమార్‌, తహసీల్దార్లు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T09:56:09+05:30 IST