ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి

ABN , First Publish Date - 2022-07-06T05:10:41+05:30 IST

ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి

ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి
కబ్జాకు గురైన భూమి గేటు దగ్గర ధర్నా చేస్తున్న నాయకులు

పరిగి, జూలై 5: కబ్జాదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేయాలనిమంగళవారం సీపీఎం, వ్యవసాయకార్మికసంఘం ఆధ్వ ర్యంలో కబ్జాకు గురైన భూమి గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.వెంకటయ్యలు మాట్లాడుతూ రంగాపూర్‌ గ్రామ పరిధిలో  సర్వేనంబరు 18లో 9.39ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, కొన్నేళ్ల క్రితం కొందరు అధికారులు, నాయకులు కలిసి రికార్డులు తారుమారు చేసి నగరానికి చెందిన కొంద రికి విక్రయించారని తెలిపారు. అయితే గతంలో ప్రభుత్వ భూమి రియల్టర్ల చేతిలో ఉండడాన్ని గుర్తించి పోరాటాలు చేశామని, తమ పోరాటాల ఫలితంగానే 2019 లో రెవెన్యూ అధికారులు ఆభూమిని స్వాధీ నం చేసుకున్నట్లు రికార్డుల్లో చూపారన్నారు. అయితే, వాస్తవానికి ఆ భూమి కబ్జాదారుల చేతుల్లోనే ఉందన్నారు. నాయకులు, అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఆ భూమిని అధికారులు ఖాళీ చేయించకపోతే, తామే పేదలతో గుడిసెలు వేయిస్తామని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  సీపీఎం నాయకులు రామకృష్ణ, హబీబ్‌, బసిరెడ్డి, సత్తయ్య, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:10:41+05:30 IST