ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-04-10T05:50:40+05:30 IST

పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే వరకూ ప్రైవేట్‌ పాఠశాలల ఉపా ధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండ గా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి అన్నారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, డీఈవో

 మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 9: పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే వరకూ ప్రైవేట్‌ పాఠశాలల ఉపా ధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండ గా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరె న్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులతో ఆ మె మాట్లాడారు. కరోనా కష్టకాలంలో సీఎం ప్రైవేట్‌ పాఠశాల టీచర్లకు అండగా నిలబడ్డారన్నారు. తిరిగి పాఠశాలలు తెరిచే వరకు ప్రతీ ఒక్కరికి నెలకు రూ.2 వేలు, 25కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా యాబై వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థా యిలో అర్హులైన ప్రతీ ఒక్క ప్రైవేట్‌ ఉపాఽధ్యాయుడు, సిబ్బందిని గుర్తించి ప్రభుత్వ సహాయాన్ని అందించా లని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పౌరసరఫరాల అధి కారులు ఉపాధ్యాయులు, బోఽధనేతర సిబ్బందికి బి య్యం పంపిణీ విధానాన్ని రేషన్‌ షాపుల ద్వారా పర్య వేక్షించాలని, సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహదారులు రాజీవ్‌శ ర్మ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలను ఈ నెల 18లోగా సమర్పించాల ని తెలిపారు. ప్రతీ ఒక్కరి బ్యాంక్‌ వివరాలను, ఆధార్‌ వివరాలను పంపాలన్నారు. అధికారులు పంపే వివ రాల ప్రకారమే వారి బ్యాంక్‌ ఖాతాలలో డబ్బు జమ చేస్తామని, క్లస్టర్‌ హెడ్‌మాస్టర్‌లు, ఎంఈవోలతో వివ రాలను పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ జిల్లాలో 173 ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయని, 1,975 మంది ఉపాధ్యాయులు, 35 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారని, ఇంకా క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తి వివరాలను సేకరించి సమర్పిస్తాన ని తెలిపారు. అలాగే జిల్లాలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు వంద శాతం కరోనా వ్యాక్సినేషన్‌ను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయుల వివరాలను అందించాలి: కలెక్టర్‌

ప్రైవేట్‌ పాఠశాలలో పని చేస్తు న్న ఉపాధ్యాయులు, సిబ్బంది వివ రాలను ఎంఈవో ప్రధానోపాధ్యా యులు క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాలని కలెక్టర్‌ శరత్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించా రు. శుక్రవారం విద్యాశాఖ అధికా రులతో, మున్సిపల్‌ కమిషనర్లతో, సివిల్‌ సప్లయ్‌ అధికారులతో స మావేశమై ప్రభుత్వం అందిస్తున్న రూ.2వేల ఆర్థిక సహాయం, 25 కి లోల బియ్యంను లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసు కునేందుకు వారి వివరాలను సేకరించాలని తెలిపారు.   మున్చ్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ రఫ్‌ంట్‌లైన్‌ వర్కర్స్‌గా ఉన్న వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఐసీడీఎస్‌ సిబ్బందిలో వ్యాక్సిన్‌ వేసుకోని వారిని గుర్తించి వచ్చే రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. అధికారులు తమ సిబ్బంది 45 సంవత్సరా లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

కామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవే క్షించాలని కలెక్టర్‌ శరత్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఏడు క్లస్టర్‌ పాయింట్లతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌లో ఏ రోజు ఎంత మంది రైతుల నుంచి కొన్నారు. ఎంత టార్గెట్‌కు ఎంత కొనుగోలు చేశారు, ఎంత మంది రైతుల వివరాల ట్యాబ్‌లో ఎంట్రీ చేశారనేది నిరంత రం పరిశీలించాలని ఆదేశించారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో సీఈవో, ట్యాబ్‌ ఎంట్రీ ఆపరేటర్లతో పరిస్థితి ని సమీక్షించుకోవాలన్నారు. కంట్రోల్‌ రూం నెంబర్‌ 18468 220051ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, డీఎస్‌వో కొండల్‌రావు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రజని, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌, మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గౌరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-10T05:50:40+05:30 IST