పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర
చింతపల్లి, జనవరి 24: భూ నిర్వాసితులకు ఎల్లప్పుడు ప్రభు త్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ కింద ముంపున కు గురై న కుటుంబాలకు చింతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను కేటాయించా రు. సోమవారం చింతపల్లి ఎ క్స్‌రోడ్డులో ఉన్న ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో రూ.2.76 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగనవాడీ భవనం, వాటర్‌ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడా రు. గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని అన్నారు. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కువ రిజర్వాయర్లు ఉన్న నియోజకవర్గంగా దేవరకొం డ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణ, ఎంపీడీవో ఎల్.రాజు, పంచాయతీరాజ్ డీఈ జీవనసింగ్, ఎంపీపీ కొండూరు భవాని, ఎంపీటీసీ వరలక్ష్మి, విద్యాసాగర్‌రావు, అశోక్, గిరిధర్, సర్పంచులు శ్రీనివా్‌సరెడ్డి, రవి, సుమతిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన కృష్ణారెడ్డి పాల్గొన్నారు.