గణేష్‌ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టే యోచన ప్రభుత్వానికి లేదు: తలసాని

ABN , First Publish Date - 2020-08-08T22:49:58+05:30 IST

గణేష్‌ ఉత్సవాలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌, సబిత ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, ఉత్సవ సమితి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి.

గణేష్‌ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టే యోచన ప్రభుత్వానికి లేదు: తలసాని

హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌, సబిత ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, ఉత్సవ సమితి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. గణేష్‌ విగ్రహాలు మూడు అడుగులకు మించొద్దని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాల ఎత్తు 6 అడుగులపైనే ఉంటుందని ప్రకటించారు. మంత్రులు, ఉత్సవకమిటీ మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని మంత్రుల నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ సారి సామూహిక నిమజ్జనం ఉండదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. ప్రభుత్వానికి సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని, విగ్రహాల ఎత్తు విషయంలో పోటీ వద్దని, చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది.

Updated Date - 2020-08-08T22:49:58+05:30 IST