భూముల విలువ పెంచిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-20T23:48:57+05:30 IST

తెలంగాణ భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది.

భూముల విలువ పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది. వ్యవసాయ భూములపై 50 శాతం పెంచారు. ఎకరా భూమి ధర కనిష్టంగా రూ. 75 వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఓపెన్ ప్లాట్ ధర గజం రూ. 200 మేర పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు వేలం ద్వారా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు. 

Updated Date - 2021-07-20T23:48:57+05:30 IST