విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-20T05:27:47+05:30 IST

విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం

విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం
అన్నోజిగూడలో పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ను ప్రారంభిస్తున్నకార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

  • కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
  • అన్నోజిగూడలో పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ ప్రారంభం

ఘట్‌కేసర్‌, ఆగస్టు 19: ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలో రూ.35లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్యనందించేందుకు గురుకుల విద్యాలయాలను స్థాపించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మెరుగైన వైద్యమందించేందుకు ప్రభుత్వాస్పత్రులను ఆధుకీకరిస్తున్నట్టు చెప్పారు. బస్తీ దవఖానాలను ఏర్పాటు చేసి అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా కొందరు ఇష్టానుసారం మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అనంతరం మంత్రి గర్భిణులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రికి పరికరాల కొనుగోలుకు సింగిరెడ్డి మల్లారెడ్డి జ్ఞాపకార్థం లక్ష్ల విరాళం ఇచ్చిన మణెమ్మను మంత్రి సన్మానించారు. అనంతరం ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌, ఉప వైద్యాధికారి నారాయణరావు, మున్సిపల్‌ చైర్మన్‌ బి.కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానవత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు లక్ష్మీశేఖర్‌, సాయిరెడ్డి, రాజశేఖర్‌, రవీందర్‌, అక్రం అలీ, నాయకులు సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, జగన్మోహన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి సత్తిరెడ్డి, బుచ్చిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.


  • ‘బీజేపీకి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలి’

మేడ్చల్‌: బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధిలో పో టీపడాలని మంత్రి మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. శుక్రవారం మేడ్చల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పోటీపడాలన్నారు. అన్నింటిపైనా జీఎస్టీ విధిస్తూ ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 24గంటల కరెంటుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని, ఆ తర్వాత క నుమరుగవుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ నాయకుల పాదయత్రతో ఒరిగేదేమీ లేదన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికనర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్‌ రమేష్‌, నాయకులు ఎం.శ్రీనివా్‌సరెడ్డి, శేఖర్‌గౌడ్‌, భాస్కర్‌యాదవ్‌, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:27:47+05:30 IST