కోకాపేట్‌ భూముల అమ్మకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-12-22T23:11:13+05:30 IST

నగరంలోని కోకాపేట్‌ భూముల అమ్మకానికి

కోకాపేట్‌ భూముల అమ్మకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్: నగరంలోని కోకాపేట్‌ భూముల అమ్మకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూముల అమ్మకంపై హెచ్‌ఎండీఏకి తెలంగాణ సర్కార్‌ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోకాపేట్‌ నియోపోలీస్‌లోని భూముల వేలానికి అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. కొనుగోలు చేసిన బిడ్డర్‌లకు సేల్ డిడ్ చేసేలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 


కోకాపేట్‌లోని 239, 240 సర్వేల్లోని భూములను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వానిదేనని పేర్కొంది. హెచ్ఎండీఏ భూముల అమ్మకంలో ప్రభుత్వానికి ఏజెంట్ మాత్రమేనని తెలిపింది. అది జరిపే లావాదేవీలన్నీ ప్రభుత్వం తరపునేనని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-22T23:11:13+05:30 IST