భూములపై నజర్‌!

ABN , First Publish Date - 2021-06-12T05:43:54+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల భూములపై రాష్ట్ర ప్ర భుత్వం దృష్టి సారించింది. ఈ భూములలో కొన్నింటిని విక్ర యించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత సంవ త్సరమే ఆయా కార్యాలయాల భూముల వివరాలను శాఖల వారీగా ప్రభుత్వం సేకరించింది.

భూములపై నజర్‌!
యంచ ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములు

జిల్లాలోని విలువైన భూములపై సర్కారు దృష్టి

శాఖల వారీగా భూరికార్డుల సేకరణ

జిల్లాలో ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో విలువైన భూములు

కొన్ని భూములను అభివృద్ధి చేసి విక్రయించే అవకాశం

జిల్లాలో నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా పెరిగిన భూముల ధరలు

నిజామాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల భూములపై రాష్ట్ర ప్ర భుత్వం దృష్టి సారించింది. ఈ భూములలో కొన్నింటిని విక్ర యించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత సంవ త్సరమే ఆయా కార్యాలయాల భూముల వివరాలను శాఖల వారీగా ప్రభుత్వం సేకరించింది. గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు ఆ శాఖల పరిధిలోని భూముల రికార్డులను పక్కా చేసింది. జిల్లాలో అవసరానికి మించి ఉన్న భూముల ను గుర్తించారు. రాష్ట్ర రాజధానితో పాటు జిల్లాల్లో ఉన్న మిగులు భూములలో కొన్నింటిని అభివృద్ధి చేసి అమ్మే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ శాఖల పరిధిలో విలువైన భూములు 

జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో విలువైన భూములు ఉన్నాయి. రెవెన్యూ, నీటి పారుదల, దేవాదాయ శాఖల పరి ధిలో భూములు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు విద్య, ఇతర శాఖల పరిధిలోనూ భూములు ఉన్నాయి. గృహ ని ర్మాణశాఖకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. ఈ భూముల వివరాలన్నీ గత సంవత్సరమే ప్రభుత్వ ఆదే శాలతో జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పంపించారు. శాఖల వారీగా ఇచ్చిన ఫార్మాట్‌లో ఈ వివరాలను ఆన్‌లైన్‌ లో నమోదు చేశారు. జిల్లాలోని అన్ని శాఖల భూముల వి వరాలను రికార్డులకు అనుగుణంగా సరిచూశారు. కార్యాల యాల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలను నమో దు చేశారు. రికార్డులను ఆధునికీకరించారు.

రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలు

జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధి లో పలు మండలాల్లో ప్రభుత్వ భూములు వందల ఎక రాలలో ఉన్నా యి. గతంలో లక్షన్నర ఎకరాలకుపై గా పేదలకు అసైన్డ్‌ చేయగా.. మిగతా భూముల వివరాల లెక్క తేల్చారు. మండల, డివిజన్‌, కలెక్ట రేట్‌ పరిధిలో ఉ న్న భూముల వివరాలను తీశారు. కొన్ని భూములను అభి వృద్ధి పనులకు వినియోగిస్తుండగా మరికొ న్ని ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని సాగునీటి శాఖ పరిధిలో భూములు ఎక్కువ గా ఉన్నాయి. కాలువలు, చెరు వులతో పా టు కార్యాలయా ల పరిధిలో ఉన్నాయి. కొ న్నిచోట్ల శిఖం భూ ము లు అన్యాక్రాంతం అయి నా వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఎస్సారెస్పీ పరిధిలో మూడు వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నా యి. ఈ భూములన్నీ ఎఫ్‌ ఆర్‌ఎల్‌ లెవల్‌ పైన ఉన్నా యి. ప్రాజెక్టు నిర్మాణం సమ యంలో ఈ భూము లను ముంపు కింద తీసుకున్నారు. నందిపేట, నవీపేట, ఆర్మూర్‌ మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములలో ఇప్పటికీ రైతులు సాగు చేసుకుంటున్నారు. దేవాదాయశాఖ పరిధిలోనూ వివిధ ఆలయాల పరిధిలో సుమారు 1,550 ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. గృహని ర్మాణ శాఖ పరిధిలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో విలు వైన భూములు ఉన్నాయి. విద్య, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీతో శాఖల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 

నగరంతో పాటు పట్టణాల్లోని భూములపైనా దృష్టి

ప్రభుత్వం నిజామాబాద్‌ నగరంతో పాటు మున్సిపాలిటీ ల పరిధిలోని విలువైన భూములపై దృష్టి సారించే అవకా శం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో  ప్రభుత్వ కార్యాలయాల్లో విలువైన భూములు ఉన్నాయి. జి ల్లా కేంద్రంలో కొన్ని సంస్థలకు ఆ భూమలను కేటాయించి ననప్పటికీ నిర్మాణాలు చేపట్టకపోవడంతో అవి ఖాళీగానే ఉ న్నాయి. కొత్త కలెక్టరేట్‌ నిర్మాణంతో దాదాపు అన్ని కార్యాల యాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వీటిలో కొన్ని భూములు ఇతర సంస్థలకు అవసరం ఉండగా.. మిగతా భూములు ఖాళీగా ఉండనున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీ టిలో కొన్నింటిని విక్రయానికి పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గత సంవ త్సరం తమ పరిధిలోని కార్యాలయాల భూముల వివరాలు పంపించామని కొందరు అధికారులు తెలిపారు. భూములు మాత్రం చాలా శాఖల పరిధిలో ఉన్నాయని వారు తెలిపా రు. కొన్నింటి చుట్టూ హద్దులు కూడా ఏర్పాటు చేశామన్నా రు. అయితే, ప్రభుత్వం రాజధాని చుట్టూ భూములనే అ మ్ముతుందా? జిల్లాల వరకు వస్తుందా? అనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.

Updated Date - 2021-06-12T05:43:54+05:30 IST