Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

  • అఖిలపక్ష నాయకులు.. నూతన కమిటీ ఏర్పాటు 

కోరుకొండ, డిసెంబరు 7: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అఖిలపక్ష నాయకులు సిద్ధంగా ఉన్నారని పేర్కొ న్నారు. కోరుకొండలో రాజానగరం నియోజకవర్గస్థాయి అఖిలపక్ష నాయకుల సమావేశం కమిటీ అధ్యక్షుడు అడపా శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం జరి గింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవాధ్య క్షులుగా మోదీ సత్తిబాబు(బీజేపీ), కనకాల నాగేశ్వరరావు(టీడీపీ), అధ్యక్షుడిగా అడపా శ్రీనివాస్‌ (అఖిలపక్ష రైతు నాయకుడు), ఉపాధ్యక్షులుగా మారిశెట్టి రమణ, బదిరెడ్డి సత్యనారాయణమూర్తి, కోశాధికారిగా గరగ శ్రీధర్‌బాబు(కాం గ్రెస్‌), జనల్‌ సెక్రటరీగా కొత్తపల్లి భాస్కరరామన్‌ (ఆర్‌పీసీ), వి.వెంకట నాయు డు (సీపీఐ ఎంఎల్‌), జాయింట్‌ సెక్రటరీగా రొంగల శ్రీనివాస్‌(టీడీపీ) ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అడపా శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆర్భాటం ఎక్కువ, అభి వృద్ధి తక్కువ అని విమర్శించారు. సీతానగరం మండలానికి సంబంధించి 1500 మంది లైసెన్స్‌డ్‌ పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతులకు రెండో పంటకు సాగునీరు ఇవ్వలేమని ఎమ్మెల్యే చేతులెత్తేయడం రైతులకు అన్యాయం చేసినట్టు కాదా అన్నారు. సెప్టెంబరు, అక్టోబరులో వచ్చిన వరదలకు పంట కోల్పోయిన మునగాల, కోటి, కూనవరం రైతులకు పంట నష్టపరిహారం అందలేదన్నారు. పంచాయతీల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం, డ్వాక్రా పొదుపును ప్రభుత్వం వాడుకోవడం సిగ్గుచేటన్నారు.

Advertisement
Advertisement